![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -166 లో... గంగ అకాడమీలో పడుకుంటుంది. తన గదిలో ఒక లెటర్ ఉంటుంది. అది చూసి చదివిన గంగ షాక్ అవుతుంది. అందులో రుద్ర చనిపోతాడని రాసి ఉంటుంది. అది పారు రాసిన ఉత్తరమే అని అనుకున్న గంగ.. తన గదికి వెళ్ళి చూస్తుంది. అక్కడ పారు పడుకొని ఉంటుంది. మరి పారు రాయకపోతే ఇంకెవరు రాసారని గంగ టెన్షన్ పడుతూ రాత్రి అంతా పడుకోదు.
మరోవైపు గంగ పోటీలో గెలవాలని ఇంట్లో ఉన్న దేవుడికి మొక్కుకుంటాడు రుద్ర. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళంతా రుద్రకి సపోర్ట్ గా మాట్లాడతారు. గంగ గెలవాలని కోరుకుంటారు. అదే సమయంలో రుద్రతో శకుంతల మాట్లాడుతుంది. గంగ గెలిస్తే మంచిదే కానీ గెలవకపోతే.. ఇంకెప్పుడు తన నోటి వెంట బాక్సింగ్ అనే పేరు వినపడకూడదు.. బాక్సింగ్ చేయకూడదని.. అలాగని నాకు మాటివ్వమని రుద్రని శకుంతల అడుగుతుంది. అలా ఆటలో గెలుపు ఓటములు సహజం ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇలా కెరీర్ ఆపేయాలా అని శకుంతలతో పెద్దసారు అంటాడు. అవన్నీ నాకు తెలియదు.. నువ్వు మాటివ్వు రుద్ర అని శకుంతల అడుగుతుంది. దాంతో రుద్ర మాటిస్తాడు. గంగ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది.. అందుకే మాటిస్తున్నానని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర వెళ్ళిపోతాడు. ఇక వీరుతో ఇషిక మాట్లాడుతుంది. రుద్రని భలే లాక్ చేసావని రుద్రతో ఇషిక అంటుంది.
మరోవైపు బాక్సింగ్ పోటీ మొదలవుతుంది. రుద్ర ఇంకా రాలేదని గంగ టెన్షన్ పడుతుంది. అదే సమయంలో రుద్ర వస్తున్న కారువి బ్రేకులో తీపించేస్తాడు వీరు. అది తెలియక ఫాస్ట్ గా వస్తుంటాడు రుద్ర. అలా వస్తున్న రుద్రకి ఎదురుగా ఒక కార్ రావడంతో అతను చెట్టుకి డ్యాష్ ఇచ్చి స్పృహ కోల్పోతాడు. అతను అలా పడిపోవడం వీరు మనిషి చూసి వీరుకి కాల్ చేస్తాడు. రుద్ర ఈజ్ నో మోర్ అని అతడు చెప్పగానే వీరు సంతోషిస్తాడు. అదే సమయంలో రుద్ర కోసం గంగ ఎదురుచూస్తుంది. ఇక ఫైనల్ రౌండ్ లో పారు వర్సెస్ గంగకి బాక్సింగ్ ఉంటుంది. అదే సమయంలో రుద్ర స్పృహలోకి వస్తాడు. మరి ఆ పోటికి రుద్ర వెళ్తాడా.. గంగ గెలుస్తుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |